Coronavirus Updates in India: దేశంలో కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో కేసులు చూస్తే..
Coronavirus Updates in India: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఆదివారం నాటికి కరోనా సోకిన వారి సంఖ్య 8,49,553, పెరిగింది.
Coronavirus Updates in India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఆదివారం నాటికి కరోనా సోకిన వారి సంఖ్య 8,49,553, పెరిగింది. ఈ గణాంకాలు covid19india.org ప్రకారం ఉన్నాయి.. వరుసగా మూడవ రోజు 27 వేలకు పైగా కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 28 వేల 637 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. 8,49,553పాజిటివ్ కేసులలో 5,34,620 మంది కోలుకున్నారు. అలాగే కొత్తగా 551 మరణాలు సంభవించాయి. దాంతో ఇప్పటివరకూ మొత్తం 22,674 మంది కరోనా భారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 2,92,258 గా ఉంది. మరోవైపు శనివారం మహారాష్ట్రలో కొత్తగా 8,139 మందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే తమిళనాడులో 3,965 మందికి పాజిటివ్‌గా నివేదించారు. దీంతో తమిళనాడులో 1 లక్ష 34 వేల 226 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. కర్ణాటకలో కొత్తగా 2,798, ఢిల్లీలో 1,781, ఉత్తర ప్రదేశ్‌లో 1,392, పశ్చిమ బెంగాల్‌లో 1,344, తెలంగాణలో 1,178ఉన్నాయి.
ఇదిలావుంటే జూలై 22 నుండి ఉదయం 5 వరకు బెంగళూరులోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి లాక్డౌన్ ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే, అవసరమైన సేవలు కొనసాగుతాయని అన్నారు. అంతేకాదు నాగాలాండ్‌లో కూడా లాక్‌డౌన్ జూలై 31 వరకు పొడిగించబడింది. వాస్తవానికి లాక్ డౌన్ ఇక్కడ జూలై 16 తో ముగుస్తుంది. కానీ రాష్ట్రంలో పెరుగుతున్న ఇన్ఫెక్షన్ కేసుల దృష్ట్యా, దీనిని 15 రోజులు పొడిగించారు. మరోవైపు, యుపిలో లాక్డౌన్ ను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజలు ఎక్కడికెక్కడ బయట తిరుగుతూ కనిపిస్తున్నారు.