Coronavirus Updates in India: దేశంలో కరోనా మరింత ఉద్ధృతి.. ఒక్కరోజే 613 మంది మృతి

Coronavirus Updates in India: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉద్ధృతంగా ఉంది. మూడు రోజుల్లోనే పాజిటివ్ కేసులు ఆరు లక్షల నుంచి 6.72 లక్షలకు చేరాయి.

Update: 2020-07-05 04:45 GMT
Coronvirus (Representational Image)

Coronavirus Updates in India: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉద్ధృతంగా ఉంది. మూడు రోజుల్లోనే పాజిటివ్ కేసులు ఆరు లక్షల నుంచి 6.72 లక్షలకు చేరాయి. దేశంలో ప్రతిరోజూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 24,850పైగా కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా 613 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదయిన కరోనా మరణాల్లో రెండో అత్యధికం..క‌రోనా బాధితుల రిక‌వ‌రీ రేటు 60శాతంగా ఉండ‌గా మ‌ర‌ణాల రేటు 2.9శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 6,73,165గా చేరగా.. మరణాల సంఖ్య 19,268మందికి చేరింది. కరోనా నుంచి 4.09 లక్షల మంది కోలుకోగా.. 2,44,814లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు భారీగా నమోదయిన దేశాల జాబితాలో రష్యా తర్వాత (6,74,515) భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే, ఆదివారం ఈ రికార్డును భారత్ అధిగమించి మూడో స్థానానికి చేరుకోనుంది.

దేశ‌వ్యాప్తంగా నిన్న ఒక్క‌రోజే దాదాపు 15వేల మంది కోలుకొని డిశ్చార్జి అయిన‌ట్లు ప్ర‌భుత్వం ప్రకటించింది. కరోనా మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 16న అత్యధికంగా 2,003 మరణాలు చోటుచేసుకోగా.. దీని తర్వాత శనివారం 608 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాదిలో గత 10 రోజుల నుంచి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల్లో బెంగాల్‌ను వెనక్కునెట్టి తెలంగాణ, కర్ణాటక 6,7 స్థానాలకు చేరాయి. కర్ణాటకలో శనివారం పాజిటివ్ కేసులు 21వేల మార్క్ దాటాయి.  

Tags:    

Similar News