Coronavirus Updates in Delhi : ఢిల్లీలో కొత్తగా 1,412 కరోనా పాజిటివ్ కేసులు

Coronavirus Updates in Delhi : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష 60 వేలు దాటింది.

Update: 2020-08-22 14:08 GMT

ప్రతీకాత్మక చిత్రం 

Coronavirus Updates in Delhi : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్ష 60 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 1412 దేశ రాజధానిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో 1230మంది కరోనా బాధితులు డిశ్ఛార్జ్ అయ్యారు. కాగా కరోనా బారిన పడి 14మంది బాధితులు గడచిన 24 గంటలలో మృతి చెందారు.

ఇప్పటివరకు దేశ రాజధానిలో 1,60,016 కరోనా కేసుల సంఖ్య నమోదయ్యాయి. కాగా మొత్తం మృతుల సంఖ్య 4,284కు చేరింది. ఇప్పటివరకు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,44,138కు చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీ లో యాక్టివ్ కేసుల సంఖ్య 11,594 ఉన్నాయి. ఢిల్లీ లో ఈరోజు నిర్వహించిన కరోనా RTPCR టెస్ట్ ల సంఖ్య 6,090. అదే విధంగా ఢిల్లీ లో ఈ రోజు 13,345 ర్యాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు దేశరాజధానిలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 14,12,363కు చేరింది. దేశ రాజధాని లో హోం ఐసోలేషన్ లో ఉన్న కేసుల సంఖ్య 5,791గా నమోదయ్యాయి. ఢిల్లీ లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 591 గా నమోదయింది. ఢిల్లీ లో ప్రభుత్వ / ప్రైవేట్ హాస్పటల్స్ లో అందుబాటులో 14,124 బెడ్లు ఉన్నాయి. ప్రతి మిలియన్ జనాభాలో 74,334 కరోనా టెస్ట్ లను చేస్తున్నారు. కాగా దేశరాజధానిలో రికవరీ రేటు 90 శాతం నమోదయింది.

Tags:    

Similar News