Third Wave: సెప్టెంబర్ వస్తుండడంతో అందరిలో థర్డ్‌వేవ్‌ టెన్షన్

Third Wave: పండుగల వేళ జాగ్రత్తగా ఉండాలంటూ ఐసీఎంఆర్ హెచ్చరిక

Update: 2021-08-31 05:36 GMT

Representational Image

Third Wave: ఆగస్టు వెళ్లిపోతోంది. సెప్టెంబర్‌ వచ్చేస్తోంది. ఇప్పుడందరి టెన్షన్‌ ఒక్కటే. అదే థర్డ్‌వేవ్. సెప్టెంబర్‌, లేదంటే అక్టోబర్‌లో ఎప్పుడైనా థర్డ్‌ వేవ్‌ తడాఖా చూపొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీని ప్రభావం సెకండ్‌ వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని ICMR తాజాగా ప్రకటించింది. కానీ నెగ్లెట్‌ చేస్తే అంతే సంగతీ అంటూ హెచ్చరిస్తోంది. రాష్ట్రాలు ఉన్నట్టుండి ఆంక్షలు ఎత్తివేసినా, నిబంధనలకు నీళ్లొదిలేసినా థర్డ్‌ వేవ్‌ డేంజర్‌గా మారుతుందని చెబుతోంది.

వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు వరుసగా పండుగలు రానున్నాయి. ఈ వేడుకలు థర్డ్‌వేవ్‌కు వేదికలు కానున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగల పేరుతో ప్రాణాలు తీసుకోవద్దని చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. అవి సూపర్ స్పెడర్లుగా మారుతాయన్నారు. కరోనా కేసులతో అల్లాడిపోతున్న కేరళ నుంచి ఇతర రాష్ట్రాలు పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థర్డ్‌వేవ్‌ సంకేతాలు కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ సమిరన్ పాండ్ అన్నారు. ఇప్పుడున్నవాటి కంటే వేగంగా వ్యాపించగల మ్యూటెంట్ సెప్టెంబర్ చివరినాటికి ప్రబలితే అక్టోబర్ లో థర్డ్‌వేవ్‌ గరిష్టస్థాయికి చేరుకుంటుందని తెలిపారు. 

Tags:    

Similar News