Covid-19: భారత్‌లో థర్డ్‌వేవ్ టెన్షన్
Covid-19: భయాందోళనలో చిన్నపిల్లల తల్లిదండ్రులు *ఊరటనిస్తున్న చిన్నపిల్లల జైకోవ్-డి వ్యాక్సిన్
Covid-19: భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక అందరిలో ఉన్న టెన్షన్ థర్డ్‌వేవ్. ఇది చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతుందన్న నిపుణుల హెచ్చరికలతో తల్లిదండ్రుల్లో భయాందోళన మొదలైంది. అయితే పిల్లల కోసం వ్యాక్సిన్‌ను తయారు చేయడం ఇప్పటికే ట్రయల్స్ కూడా నిర్వహించడం కొంత ఊరట కలిగిస్తోంది.
థర్డ్‌వేవ్ అందరినీ కలవరపెడుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు స్కూళ్లు కూడా తెరుచుకోవడం ఈ భయానికి ఆజ్యం పోస్తోంది. ఇక కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల కోసం జైకోవ్-డి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ట్రయల్స్ పూర్తికాగా అత్యవసర వినియోగానికి ICMR అనుమతి కూడా లభించిందని అంటున్నారు వైద్య నిపుణులు.
థర్డ్‌వేవ్ రాక ముందే చిన్న పిల్లలకు వ్యాక్సిన్ వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేశాయి. మరికొన్ని ట్రయల్స్ దశలో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలకు వైరస్ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ పూర్తికావాలని నిపుణులు తెలుపుతున్నారు. చిన్న పిల్లల కోసం జైకోవ్-డి వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని అన్నారు.