Coronavirus: ఇండియాలో ఆగని కరోనా సెకండ్ వేవ్ విజృంభణ

Coronavirus: వరుసగా నాలుగో రోజు రెండు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు * గడిచిన 24గంటల్లో 2 లక్షల 61వే 500 మందికి కోవిడ్

Update: 2021-04-18 05:03 GMT

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: ఇండియాలో కరోనా సెకండ్ విడత విలాయతాండవం చేస్తోంది. వరుసగా నాలుగో రోజు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో 2 లక్షల 61వేల 5వందల మందికి కరోనా సోకింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటి 47 లక్షల 88 వేలు దాటింది. కోవిడ్ బారిన పడి మరో 15వందల మంది మృతి చెందారు. దీంతో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య లక్షా 77వేల 150 కి చేరింది. కోవిడ్ నుంచి కోలుకుని మరో లక్షా 38వేలకు పైగా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.

దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18లక్షలకు పైగా ఉన్నారు. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 87.23 శాతంగా ఉంది. దేశంలో నమోయిన మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 15 లక్షల 66వేల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించార. దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటలలో 26లక్షలకు పైగా వ్యాక్సిన్ తీసుకున్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడిచింది. 

Tags:    

Similar News