Coronavirus: దేశంలో కోరలు చాస్తున్న కరోనా సెకండ్ వేవ్

Coronavirus: మరోసారి లక్షదాటిన రోజూవారీ కేసుల సంఖ్య * గడిచిన 24గంటల్లో లక్షా 52వేల 879 పాజిటివ్ కేసులు

Update: 2021-04-11 05:15 GMT
ఫైల్ ఇమేజ్ 

Coronavirus: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తోంది. దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పట్లో ఆగేలా లేదు. కొద్దివారాలుగా ఎన్నడూ లేనంత వేగంగా మహమ్మారి విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా అదే స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా దేశ వ్యాప్తంగా 14 లక్షల 12వేలకు పైగా టెస్ట్‌లు చేస్తే వారిలో.. లక్షా 52 వేల 879 మందికి కరోనా సోకింది. దీంతో దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి 33లక్షల 59వేలకు చేరింది.

గడిచిన 24గంటల్లో కొవిడ్ సోకి మరో 839 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య లక్షా 69వేల 275 కి చేరింది. దేశ వ్యాప్తంగా మరో 90వేల 584 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 11లక్షల 8వేల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో 90.80 శాతం కరోనా రోగుల రికవరీ రేటున్నట్టు కేంద్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.93శాతంగా ఉందని వెల్లడిచింది. మరణాల రేటు 1.28 శఆతం ఉన్నాయి. 

Tags:    

Similar News