భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. దీంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరగడంతో వైద్యులు సైతం కలవరపడుతున్నారు. అటు రెండోసారి వైరస్ బారిన పడిన వారిలో వ్యాధి లక్షణాల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు.
దేశంలో డెడ్లీ వైరస్ పీక్ స్టేజ్‌కు చేరుకుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహమ్మారి బారిన పడకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. సాధ్యమైనంతవరకు స్వీయ నియంత్రణ పాటించాలని చెబుతున్నారు. మరోవైపు జనాలు మాత్రం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు.