Coronavirus precautions : వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడమే కరోనా నుంచి రక్షిస్తుంది!

Update: 2020-07-11 02:26 GMT

Coronavirus precautions : కరోనా కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎక్కడో చైనాలో మొదలై ఈ మహమ్మారి చూస్తుండగానే మన గుమ్మంలోకి వచ్చేసింది. కరోనా పేరు చెబితేనే కొందరు హడలిపోతున్నారు. అయితే కొవిడ్‌ గురించి అంతగా భయపనక్కర్లేదని మనోధైర్యంతో సరైనా జాగ్రత్తలు తీసుకుని వైరస్‌ను జవియించవచ్చని పలువురు చెబుతున్నారు.

కరోన బారి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు ఇమ్యునిటీ పెంచుకోవడానికి గుడ్లు, నిమ్మరసం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతంలో వారానికి రెండు మూడు సార్లు మాత్రమే ఉపయోగించే నిమ్మకాయలు, కోడిగుడ్లు ఇప్పుడు ప్రతి రోజు వినియోగిస్తున్నారు. దీంతో నిమ్మ, కోడిగుడ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి కోడిగుడ్లు విపరీతంగా అమ్ముడు అవుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. గుడ్లు ప్రతిరోజు తినడానికి ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోతున్నాయని చెప్తున్నారు. దీనివల్ల వ్యాపారం కూడ బాగుందంటున్నారు. 

మరోవైపు వ్యాదినిరోదక శక్తి పెంచుకోవాలంటే సీ విటమిన్ అధికంగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో నిమ్మకాయలకు భారీ డిమాండ్‌ పెరిగింది. గ్రేటర్ పరిదిలో ఉన్న అన్ని మార్కేట్ లలోకి నిమ్మకాయలు భారీగా దిగుమతి అవుతున్నాయి. ఎగ్స్ ద్వారా మంచి ప్రోటీన్స్ లభిస్తాయని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్, సుజాత తెలిపారు. దీనిలో విటమిన్ ఏ,డీ ఐరన్ లాంటివి ఉండడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుందన్నారు. సీ విటమిన్‌ పెంచుకోవడానికి నిమ్మ చాలా మంచిదని సూచించారు. మొత్తంగా కరోనా ధాటినుంచి రక్షించుకోవడానికి ప్రజలు పలు రకాల ఆహార జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచి పోషక పదార్థాలు తీసుకొని కరోనాను ఎదుర్కొంటున్నారు.

Tags:    

Similar News