Coronavirus Positive for Prisoners in UP: నేరస్తులకు పాజిటివ్ సెగ.. ఒకే జైలులో 120 మందికి పాజిటివ్
Coronavirus Positive for Prisoners in UP: కరోనాకు పెద్ద, చిన్నా, మంచివాడు, చెడ్డవాడు అనే తేడా లేదు.
Coronavirus Positive for Prisoners in UP: కరోనాకు పెద్ద, చిన్నా, మంచివాడు, చెడ్డవాడు అనే తేడా లేదు. తను చెప్పినట్టు నడుచుకోకపోతే వెంటనే తన పని పట్టేస్తుంది... ప్రస్తుతం యూపీ జైలులో ఉంటున్న ఖైదీలకు సైతం అధిక సంఖ్యలో కరోనా వైరస్ సోకింది. దీంతో ఉలిక్కి పడ్డ జైలు అధికారులు వారందర్నీ ప్రత్యేక క్వారెంటైన్కు పంపి, ఊపిరి పీల్చుకున్నారు.
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలు దాటిపోయింది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, వైద్యులు, పోలీసులు, ప్రముఖ నటులు ఈ వైరస్ బారిన పడుతూనే ఉంటున్నారు. సామాన్యులతో పాటు వారికి కూడా కరోనా వస్తూండటంతో ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటు నుంచి ఎలా ఈ కోవిడ్ మహమ్మారి ఎటాక్ చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.
కాగా ప్రస్తుతం జైళ్లలో ఉంటోన్న ఖైదీలకు సైతం ఈ కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్న ఝాన్సీ జైల్లో ఉంటోన్న 120 మంది ఖైదీలకు కోవిడ్ నిర్థారణ అయింది. దీంతో అప్రమత్తమై జైళ్ల శాఖ వెంటనే వారిని అక్కడి నుంచి తరలించి ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచింది. అలాగే వీరితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా టెస్టులు నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం. కాగా దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల లిస్టులో ఉత్తర్ ప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ 55,588 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 1263 మంది మరణించారు.