Coronavirus Effect: సెలబ్రిటీలను వదలని కరోనా
Coronavirus Effect:ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా. దీనివల్ల ధనిక, పేద, అధికారం, అనధికారం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అందరినీ ఒక గాటన పెట్టి సోకుతోంది.
Coronavirus Effect: ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా. దీనివల్ల ధనిక, పేద, అధికారం, అనధికారం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అందరినీ ఒక గాటన పెట్టి సోకుతోంది. అయితే దీనిని ఎదురించి, ధైర్యంగా కొంతమంది కోలుకుంటే, మరి కొంత మంది ఎదురొడ్డి పోరాటం చేయలేక అశువులు బాస్తున్నారు. ఈ విధంగా అందరినీ ఒక గాటన కట్టిన ఈ కరోనా మన దేశంలో ఎంత మంది సెలబ్రిటీలను వేధించిందో క్లుప్తంగా మీకోసం...
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.. కొరోనా బారిన పడుతున్న సెలబ్రిటిల సంఖ్య కూడా బారిగా పెరుగుతుంది.. షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన వెంటనే సీరియల్ నటులు ఒక్కొక్కరు కరొనా బారిన పడగా తాజాగా సినిమా వారి జాబితా కూడా పెరిగింది..సినిమారంగం,రాజకీయం, క్రీడారంగం ప్రతి రంగంలోని సెలబ్రిటిలు కరోనాని ఎదుర్కొంటున్నారు.. ఇప్పటివరకు కరొనా బారిన పడిన సెలబ్రిటిలు ఎవరో చూద్దాం..
అమితాబ్ బచ్చన్ కుటుంబం: అమితాబ్ బచ్చన్ తో పాటు కుటుంబ సభ్యులు అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలు కరోనా బారిన పడ్డారు.బిగ్ బి కుటుంబం నానావతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు.. ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్ కాగా, 23రోజుల ట్రీట్మెంట్ తర్వాత అమితాబ్ కూడా కరోనాని జయించారు.. ప్రస్తుతం అభిశేక్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు.
అమిత్ షా: కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా కరోనా బారిన పడడం అందరికి షాక్ కి గురిచేసింది..లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయింది..ప్రధానితో కేబినెట్లో అమిత్ షా పాల్గొన్నారు.దాంతో బిజెపి మంత్రులంతా అప్రమత్తమయ్యారు.
శివరాజ్ సింగ్ చౌహాన్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోవిడ్ బారిన పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.. పదకొండు రోజుల ట్రీట్మెంట్ తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.సామాన్యులకు అందచేస్తున్న ట్రీట్మెంటే ముఖ్యమంత్రి తీసుకోవడం విశేషం.
యడ్యూరప్ప: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.దాంతో సిఎం కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా ఆయన కుమార్తెకి పాజిటివ్ గా తేలింది..సిఎం ఆఫీస్ లో ఉద్యోగులందరిని రెండు వారాలు క్వారంటైన్లో ఉండాల్సందిగా కోరారు.
కనికా కపూర్: కరోనా బారిన పడిన మొదటి ప్రముఖ వ్యక్తి సింగర్ కనికా కపూర్.. ఈమె విదేశాల నుండి వచ్చి బర్త్ డే పార్టిలో పాల్గొనడంతో దేశంలో కలకలం రేగింది..తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిరెండు వారాల తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయింది.
వాజిద్ ఖాన్ : బాలివుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనా బారిన పడి మృతి చెందారు.
షాహిద్ అఫ్రిది: పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కరోనా బారిన పడ్డారు.
విశాల్, అతని తండ్రి: విశాల్ మరియు అతని తండ్రి జికె రెడ్డి కరోనా బారిన పడ్డారు…ఇంట్లోనే ఉ:డి హోమియో వైద్యంతో కరోనాని తగ్గించుకున్నామని విశాలే స్వయంగా ప్రకటించారు.
రాజమౌళి మరియు కుటుంబ సభ్యులు: రాజమౌళి సహ కుటుంబ సభ్యులు అందరకి కరోనా పాజిటివ్ వచ్చింది..హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా ఉన్నాయని ఎప్పుడో ఫామ్ హౌజ్ కి వెళ్లిపోయింది రాజమౌళి కుటుంబం అయినప్పటికి కరోనా బారిన పడకతప్పలేదు.
బాలసుబ్రహ్మణ్యం: లెజెండరి సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.. దీంతో చెన్నైలోని చులైమెడు లోని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటన్నారు.
సున్నం రాజయ్య: సిపిఎం పార్టికి చెందిన సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందారు..మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన వ్యక్తి..
పృద్వి: థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృద్వి కూడా కరోనా బారిన పడ్డారు.. ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
డైరెక్టర్ తేజ: వెబ్ సిరిస్ పనుల్లో ముంబై వెళ్లి వచ్చిన డైరెక్టర్ తేజకి పాజిటివ్ నిర్దారణ అయింది..దాంతో అతని కుటుంబ సభ్యులకు ,యూనిట్ కి టెస్ట్ చేయగా కేవలం తేజ తప్ప మిగతావారు నెగటివ్ వచ్చింది..ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు తేజ.
సింగర్ స్మిత: సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు..తనని కలిసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాలని కోరారు.. కరోనా నుండి కోలుకున్నాక ప్లాస్మా దానం చేస్తానని ప్రకటించారు.
సీరియల్ నటులు నవ్య స్వామి, రవికృష్ణ: సీరియల్ షూటింగ్స్ ప్రారంభం కావడంతోనే కోరోనా గా నిర్దారణ అయిన నటులు నవ్యస్వామి, రవికృష్ణ..
జ్యోతిరాదిత్యా సిందియా: జ్యోతిరాధిత్యా సింధియా మరియు అతని తల్లి మాధవి రాజే సింధియా కూడా కరోనా బారిన పడ్డారు. లక్షణాలు కనపడడంతో ఇద్దరు టెస్ట్ చేయించుకోగా కరోనాగా నిర్దారణ అయింది.
నోవాక్ జకోవిక్: ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిక్ కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది..అతని భార్య జెలినా కూడా పాజిటివ్ రాగా వారి పిల్లలకు నెగటివ్ వచ్చింది.