Coronavirus: లాక్‌డౌన్ భయం.. కార్మికుల పయనం
Coronavirus: కరోనా రక్కసి మరోసారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. పెరుగుతున్న కేసుల సంఖ్య అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
Coronavirus: కరోనా రక్కసి మరోసారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. పెరుగుతున్న కేసుల సంఖ్య అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది లాగే లాక్‌డౌన్ తప్పనిసరిగా విధించాలని కొందరు కోరుతున్నారు. ఇంకొందరు అప్పుడే గ్రామాల బాట పడుతున్నారు. హైదరాబాద్‌లో వివిధ వర్గాల ప్రజలు ప్రస్తుత కరోనా వ్యాప్తిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణలో రోజు రోజుకు పెరగుతున్న కరోనా కేసులపై విద్యార్ధులు, వ్యాపారస్థులు, కార్మికులు ఏమనుకుంటున్నారనే విషయాన్నిhmtv పరిశీలించింది.
లాక్‌డౌన్ విధిస్తే చాలా ఇబ్బందులు తలెత్తుతాయని విద్యార్ధులు అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో కూర్చుంటే మైండ్ లేజీగా తయారౌతుందని, బోర్ కొడుతుందని స్టూడెంట్స్ చెబుతున్నారు. హైదరాబాద్‌లో త్వరలో లాక్‌డౌన్ విధిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో చిరువ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్ విధిస్తే తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని విచారం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో లేని కారణంగా ఇబ్బందులు తప్పడం లేదని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నకార్మికులు ప్రస్తుతం వలస బాట పడుతున్నారు. లాక్‌డౌన్ విధిస్తే ఇబ్బందులు తప్పవని ముందుగా గ్రహించి సొంత రాష్ట్రాలకు పయనమౌతున్నారు.