క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి సమష్టిగా కృషి చేయాలి- మల్లికార్జున ఖర్గే

Coronavirus: దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే.

Update: 2021-05-10 05:15 GMT

క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి సమష్టిగా కృషి చేయాలి - మల్లికార్జున ఖర్గే

Coronavirus: దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఆరు సలహాలను కూడా అందులో పేర్కొన్నారు. అందరికీ ఉచితంగా టీకాలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బడ్జెట్​లో టీకాలకు 35వేల కోట్లను కేంద్రం కేటాయించినప్పటికీ టీకా ధర నిర్ణయం ప్రైవేటు సంస్థలకు వదిలేసిందని విమర్శించారు. అలాగే టీకాల కొనుగోలు రాష్ట్రాలకు అప్పజెప్పడం ద్వారా ప్రజల పట్ల కేంద్రం తన బాధ్యతను విరమించుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

Tags:    

Similar News