Coronavirus Impacts: పేద, మధ్యతరగతి ప్రజల జీవనంపై కరోనా ఎఫెక్ట్
Coronavirus Impacts: పేద, మధ్యతరగతి ప్రజలను కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది.
Coronavirus Impacts: పేద, మధ్యతరగతి ప్రజలను కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది. కోవిడ్ కట్టడికి ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో పనులు లేక తినడానికి డబ్బులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పట్టణాల్లో పనులు లేకపోవడంతో సొంతూళ్ల బాట పట్టారు కూలీలు. అయితే సొంతూల్లో కూడా ఉపాధి పనులు దొరకకపోవడతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నామంటున్నారు కూలీలు.
వ్యవసాయంపై ఆధారపడే రైతులు లాక్‌డౌన్ వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంక్షల నేపథ్యంలో పండించిన పంటను అమ్ముకోలేక, డబ్బులు లేక మూడుపూటల తిండి తినలేకపోతున్నారు. సడలింపు సమయం కూడా తక్కువగానే ఉండటంతో తమకు ఎలాంటి పని దొరకడం లేదని రోజువారీ కూలీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఉపాధిహామీ పనితో వచ్చే డబ్బు తమకు గిట్టుబాటు కావడం లేదని కూలీలు వాపోతున్నారు. పేరుకే ఉపాధిహామి అని, కూలీ మాత్రం చాలా తక్కువని ఆవేదన చెందుతున్నారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధిహామీ కూలీ పెంచాలని కూలీలు కోరుతున్నారు.