Amarnath Yatra 2020 : మంచు కొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది చుట్టూ ఎత్తయిన కొండలు కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సీజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. ఇంతటి ప్రతికూల పరిస్థితిలో మహమ్మారి మాటేసిన సంక్షోభ సమయంలో అమర్‌నాథుడి దర్శనానికి భక్తులు బారులు తీరే సమయం వచ్చేస్తోంది. ఏడాదిలో కేవలం 45 రోజుల పాటు కనిపించే మంచు శివలింగ దర్శనం కరోనా ప్రభావంతో 15 రోజులకు కుదించారు. ఇంతటి విపత్కర సమయంలోనూ అమర్‌నాథ్ యాత్ర కోసం ఎందుకింత ఆరాటం.? చావు బతుకుల మధ్య ఇంత పోరాటం ఎందుకోసం? కరోనా కథాకళి మధ్య అమర్‌నాథ్‌లో పరమేశ్వరుని ఉనికి ఏమిటి?
ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్ర అమర్‌నాథ్ యాత్ర. తిరిగి వస్తామో, రామో అన్న భయం. ఇరుకైన దారి ఇరుపక్కలా లోయలు కళ్లు తెరిస్తే ఎక్కడ పడిపోతామో అన్నంత భయం తెరవకపోతే ఎలా వెళ్తున్నామో తెలియని అయోమయం ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యువు మన వెనకే నడుస్తుంటే దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే వెళ్లటమే అమర్‌నాథ్ యాత్ర. అలాంటి అమర్‌నాథ్ యాత్రను కరోనా కష్టకాలంలో రద్దు చేద్దామనే అనుకున్నారు కానీ తర్వాత నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నెల 21 నుంచి రెండు వారాల పాటు అంటే ఆగస్టు 3 వరకు యాత్ర కొనసాగనుంది.-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..