Coronavirus: భారత్‌లో కరోనా కలవరం
Coronavirus: లక్ష దాటుతున్న రోజువారీ కేసులు * ఇవాళ కొత్తగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు
Coronavirus: భారత్‌లో కరోనా కలవరపెడుతోంది. రోజువారీ కేసులు లక్ష దాటుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా లక్ష కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ దేశ వ్యాప్తంగా కొత్తగా లక్షా, 15వేల, 736 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాకు 630 మంది బలయ్యారు. దేశ వ్యాప్తంగా కోటి, 28 లక్షల, వెయ్యి, 785కి చేరాయి కరోనా కేసుల సంఖ్య. దేశ వ్యాప్తంగా 8లక్షల 43వేల 473 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,66,177కి చేరుకుంది.