Coronavirus Effect: వెల వెల బోతున్న మీ సేవ కేంద్రాలు !

Update: 2020-08-14 08:29 GMT

Coronavirus Effect: మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలన్నా మీ సేవ ను ఆశ్రయిస్తాం. నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్లే అవసరం లేకుండా ఒకే దగ్గిర అన్ని రకాల సేవలు పొందే వెసులుబాటు ఈ సేవా కేంద్రాలలో ఉన్నాయి. ఐతే ఇప్పుడు లాక్ డౌన్ కారణంతో జనం లేక ఈ సేవా కేంద్రాలు బోసిపోతున్నాయి. కోవిడ్ పుణ్యమా అని అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతున్న ఈ సేవా కేంద్రాలు ఇప్పుడు వెలవెలబోయాయి. ప్రతీ సంవత్సరం ఈ సమయానికి క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్ కమ్ సర్టిఫికేట్లు, స్కాలర్షిప్ అప్లికేషన్ల కోసం విద్యార్దులతో ఈ కేంద్రాలు కిటకిటలాడుతుండేవి. కానీ ఇప్పటి వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాకపోవడంతో విద్యార్దులెవరు కనిపించడం లేదు.

మీసేవల నుంచి 270 కి పైగా సేవ కార్యక్రమాలు అందిస్తున్నారు. కరోనాకి ముందు రోజు వరకు 300 మందికి పైగా వివిధ సేవల నిమిత్తం మీసేవల దగ్గరికి వస్తుండేవారని ప్రస్తుతం కనీసం రోజుకు 20 మంది వరకు కూడ రావడం లేదని ఓ మీ సేవ నిర్వహకులు తెలుపుతున్నారు. గతంలో మీసేవల వద్ద కనీసం నిలబడడానికి కూడ చోటు ఉండేది కాదు. తాము తినడానికి కూడా సమయం ఉండేది కాదని ప్రస్తుతం ఎవరు రాకపోవడంతో నిర్వహణ భారం పెరిగిందన్నారు. తమ దగ్గర పని చేసే వారికి జీతాలు చెల్లింపు దగ్గర నుంచి అద్దెలు, విధ్యుత్ చార్జీలు, ఇంటర్నెట్ బిల్లులు తీవ్ర భారంగా మారాయని తెలిపారు.

లాక్ డౌన్ సడలించినప్పటికీ జనం అత్యవసరం ఉంటే తప్పించి బయటికి రాని పరిస్థితి. దానికి తోడు పబ్లిక్ కి మొబైల్ యాప్ లపై అవగాహన బాగా పెరగడంతో పెద్ద మొత్తంలో మీ సేవాలో చేయాల్సిన పనులన్నీ ఇంటి వద్ద నుంచే చేసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా నామమాత్రంగా నడుస్తున్నాయి. దాంతో రెవెన్యూ శాఖకి సంబంధించిన పత్రాల కోసం పబ్లిక్ రావడం లేదని ఓ మీసే నిర్వాహకుడు తెలిపాడు. కరోనాతో ప్రభావంతో ప్రతి రంగంలో జనం ఉపాది కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు మీసేవ నిర్వహకులు కరోనా తగ్గి విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News