Coronavirus Effect: కరోనా ప్రభావంతో నెగెటివ్ వృద్ధిరేటులోకి భారత్?

Coronavirus Effect: కరోనా ప్రభావంతో భారత్ నెగెటివ్ వృద్ధిరేటులోకి వెళ్ల నుందా అంటే అవుననే సమాధానం వస్తుంది.

Update: 2020-06-27 10:01 GMT

Coronavirus Effect: కరోనా ప్రభావంతో భారత్ నెగెటివ్ వృద్ధిరేటులోకి వెళ్ల నుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎఎంఎఫ్ అంచనాల మేరకు ఈ ఏడాది ఇండియా మైనస్ 4 పాయింట్ 5 శాతం వృద్ధిరేటును నమోదు చేసే అవకాశం ఉంది. 2021 లో భారత్ తిరిగి పుంజుకుని 6 శాతం మేర వృద్ధిరేటు సాధించే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా కాటు. నెగెటివ్ వృద్ధిరేటులోకి ప్రపంచం.

అభివృద్ధి దేశాల్లో మైనస్ 8 శాతం వృద్ధిరేటు. భారత్ లో మైనస్ 4.4 శాతం వృద్ధిరేటుకు అవకాశం. 1961 తర్వాత ఇండియాలో ఇదే తక్కువ వృద్ధిరేటు. వచ్చే ఏడాది పుంజుకోనున్న భారత వృద్ధిరేటు. కరోన ప్రభావం ప్రపంచ వృద్ధి రేటుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం వుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్పష్టం చేసింది. లాక్ డౌన్ తో 2020 ప్రథమార్థంలో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు దాదాపు నిలిచిపోవడంతో వృద్ధిరేటు నెగటివ్ లోకి జారిపోతుంది.

వైరస్ ఎఫెక్ట్ ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాలపై తీవ్రంగా ఉండే అవకాశం వుంది. అభివృద్ది చెందిన దేశాల్లో గ్రోత్ రేటు మైనస్ 8 శాతానికి పడిపోనుంది. భారత్ లో గత ఐదు దశాబ్దాల తర్వాత ఈ ఏడాదిలో అత్యంత తక్కువ వృద్ది రేటు నమోదయ్యే అవకాశం వుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరోన కేసులు పెరుగుతుండం, లాక్ డౌన్ తో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో భారత్ లో వృద్ధి రేటు భారీగా తగ్గుతోంది. 2020 ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు మైనస్ 4.5 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 1961 తర్వాత భారత్ లో ఇంత తక్కువ వృద్ధిరేటు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైమ్.

భారత్ లో మైనస్ వృద్ధిరేట్ నమోదు అవుతుంటే మరోవైపు వ్యవసాయ రంగం 3 పాయింట్ 5 శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉంది, దీనికి సానుకూల రుతుపవనాలే ఇందుకు కారణం. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత్ తిరిగి పుంజుకుంటుందని, సుమారు 6 శాతం మేర వృద్ధి రేటు సాధించే అవకాశం వుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. కరోనా కాటుకు ప్రపంచమంతాట నెగటివ్ వృద్ధిరేటులోకి జారిపోతుంటే

చైనా మాత్రం దీనికి విరుద్ధంగా ఒక శాతం మేర వృద్ధిరేటు సాధించే అవకాశం ఉంది. దీనికి ఆ దేశం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ కారణమని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్టులు చెబుతున్నారు. కరోనా విజృంభణ మరింత కొనసాగితే ప్రపంచం మరింత పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉందని ఎఎంఎఫ్ హెచ్చరించింది.


Tags:    

Similar News