Coronavirus: మహారాష్ట్రను వణికిస్తోన్న కరోనా
Coronavirus: పుణె జిల్లాలో రోజుకు 8వేలకు పైగా పాజిటివ్ కేసులు * ఈనెల 9వరకు జిల్లాలోని ప్రార్థనా స్థలాలు బంద్
Coronavirus: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. పుణె జిల్లాను కొవిడ్ వణికిస్తోంది. గత రెండు రోజులుగా రోజుకు 8వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇవాళ్టీ నుంచి ఏడు రోజుల పాటు సాయంత్రం 6 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
అదే విధంగా కరోనా నేపథ్యంలో ఈ నెల 9 వరకు పుణెలోని ప్రార్థనా స్థలాలన్నీ మూతపడ్డాయి. శనివారం ఆలయాలు తెరుచుకోలేదు. దీంతో భక్తులు ఆలయాల భక్తులు బయటి నుంచే ప్రార్థనలు చేసుకుంటున్నారు. ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, బార్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కర్ఫ్యూ సమయంలో మందులు, ఆహార పదార్ధాలు హోం డెలివరీకి, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు తెలిపారు.