Coronavirus: టీకా వేసుకున్నా.. మాస్కులు తప్పనిసరి :ఎయిమ్స్ డైరెక్టర్
Coronavirus: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని ఎయిమస్ డైరెక్టర్ గులేరియా స్పష్టం చేశారు
Coronavirus: రోజు రోజుకి కరోనా వైరస్ అనేక విధాలుగా రూపు మార్చుకుంటున్నందున, ఇప్పటి వ్యాక్సిన్లు దానిపై ఎంతమేర పనిచేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే, భౌతిక దూరం సైతం పాటించాలన్నారు.
అమెరికా వంటి దేశాల్లో రెండు డోసుల టీకా తీసుకున్న వారు మాస్కు ధరించనవసరంలేదని అక్కడి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ పొందినవారు మాస్కులు ధరించాల్సిన పనిలేదన్న అంశాన్ని ప్రస్తుతానికి మార్గదర్శకాల్లో చేర్చబోవడంలేదని స్పష్టం చేసింది. వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో మాస్కులు ధరించనవసరం లేదనడం సరైన నిర్ణయం కాదని కేంద్రం పేర్కొంది.
ఇదిలావుంటే, రానున్న 2 నెలల్లో భారీ మోత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారని ఎయిమ్స్ డైరక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. విదేశాల నుంచి కూడా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటూనే, దేశీయంగా ఉత్పత్తి పెంచడంపై దృష్టి సారించామని అయన అన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల ఉత్పత్తి దేశంలో చాలా ప్లాంట్లలో జరగుతుందని అది తర్వలో అందుబాట్లోకి వస్తుందని అన్నారు.