గుజరాత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా తగ్గుతున్న సమయంలో వ్యాక్సినేషన్ జరుగుతుంటే గుజరాత్‌లో మాత్రం పాజిటివ్ కేసులు కలవర పెడుతున్నారు. దీంతో కరోనా కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌లలో కర్ఫ్యూని పొడిగించింది. ఫిబ్రవరి 28వరకు అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6గంటల వరకు ఈ కర్ప్యూ అమల్లోకి ఉంటుందని వెల్లడించింది.
గతంలో రాత్రం 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఉన్న ఈ సమయాన్ని ఒక గంట పాటు తగ్గించారు. ఈనెల 16 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని రాష్ట్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7.91 లక్సల మంది తొలి డోసు వేయించుకున్నారు. గుజరాత్‌లో ఆదివారం కొత్తగా 247 కేసులు వచ్చాయి.