Corona Vaccine: 18-45 వయసు వారికి అందుబాటులోకి రాని టీకాలు

Corona Vaccine: వ్యాక్సిన్‌ తయారీ కంపెనీల నుంచి సరఫరా షెడ్యూల్‌ వచ్చాకే నిర్ణయం

Update: 2021-04-28 06:57 GMT

కరోనా వాక్సిన్ 

Corona Vaccine: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరు టీకా తీసుకునేందుకు నేటి నుంచి కొవిన్‌ రిజిష్ట్రేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. కానీ తెలంగాణలో మాత్రం 18 పైబడిన వారికి టీకా విషయంలో ఇంకా అయోమయం పరిస్థితి నెలకొంది. టీకాలను తయారు చేస్తున్న కంపెనీల నుంచి టీకా సరఫరాపై నిర్దిష్టమైన షెడ్యూలు వచ్చిన తర్వాతే.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్‌ వేసే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల అంటున్నారు. దీనిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించిన తర్వాత రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

అలాగే వ్యాక్సిన్‌ రిజిష్ట్రేషన్‌కు కోసం ఒక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులంటున్నారు. మరోవైపు 18 నుంచి 45 ఏళ్లవారికి వ్యాక్సిన్‌ ఇచ్చే బాధ్యత రాష్ట్రాలదేనని ఇప్పటికే కేంద్రం తేల్చిచెప్పింది. ఆ టీకాలను అయా రాష్ట్రాలే కొనుగోలు చేయాలి.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా గందరగోళంగా సాగుతోంది. 45 పైబడిన వారికే వ్యాక్సిన్లు సరిపోని పరిస్థితులుంటే 18 పైబడిన వారికి ఎక్కడి నుంచి టీకా తీసుకురావాలని వైద్యశాఖ ప్రశ్నిస్తోంది. ఇదే విషయంపై ఇతర రాష్ట్రాలు కూడా కేంద్రంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News