దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రెడీ అయ్యింది. జనవరి 16 నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దీనికోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యాక్సిన్ వచ్చాక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డ్రైరన్ కూడా నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎవరెవరికీ ముందుగా ఇవ్వనున్నారు? వ్యాక్సిన్ తీసుకునే వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది తెలుసుకుందాం.
కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక. ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో మొదట వైద్య సిబ్బందికి ఆ తర్వాత వివిధ శాఖల్లో పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అందించాలని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మొదట వ్యాక్సిన్ తీసుకోవడానికి సిబ్బంది ముందుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి తాము ఏ మాత్రం భయపడటం లేదన్నారు. అందరి కోసం పని చేశామని.. ఇప్పుడు ముందుండి వ్యాక్సిన్ తీసుకుంటామని తెలిపారు. కాస్త భయం ఉన్నా ప్రజల్లో ఉన్న ఆందోళన తొలగించడానికి ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చామంటున్నారు.
తెలంగాణలో వ్యాక్సిన్ డ్రై రన్ సక్సెస్‌గా పూర్తవుతోందని యూనిసెఫ్ డాక్టర్ తెలిపారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిని మొదటగా డిటైల్స్ ఎంటర్ చేసుకొని, హెల్త్ కండిషన్ చూసి వ్యాక్సిన్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లే వరకు అన్ని స్టేజ్‌లో డాక్టర్స్ ఉంటారని చెప్పుకొచ్చారు.
వ్యాక్సిన్ వేసుకునే సమయంలో ఏం తీసుకొని రావాలి అనేది మొబైల్‌కి సమాచారం ఇస్తామన్నారు. సెంటర్‌కు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామంటున్నారు.వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక మొదటగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇచ్చి ఏదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న కూడా వైద్యం అందించడానికి అన్ని చోట్లా డాక్టర్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.