Corona Vaccine: మన దేశంలో కరోనా వ్యాక్సిన్ మొదట ఇచ్చింది ఎవరికో తెలుసా?
దేశంలో కరోనా వ్యాక్సిన్ మొదట టీకా వేసుకున్నది ఇతనే!
కరోనా మహమ్మారిపై అసలు యుద్ధానికి తెర లేచింది. టీకా అందుబాటులోకి వచ్చింది. మొదటి టీకాను ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దేశంలో తోలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్ లో పనిచేసే పారిశుధ్య కార్మికుడు మనీష్ కుమార్ కు వేశారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమక్షంలో తొలిసారిగా టీకాను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్ మనీష్ కుమార్ కు వేశారు. కరోనా ఎదుర్కునేతప్పుడు ఎలాంటి ధైర్యాన్ని ప్రదర్శించారో అటువంటి ధైర్యాన్నే ఇప్పుడు కూడా చూపాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. కరోనా మహమ్మారిపై యుద్ధం సమయంలో యావత్ భారతావని కుటుంబంలా మారిందని, సమైక్యతతోనే వైరస్‌ను ఎదుర్కోగలిగామని ఆయన తెలిపారు.
Manishదేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దేశంలో తొలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన స్థానిక పారిశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్‌కు వేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమక్షంలో కొవిడ్ యోధుడికి వ్యాక్సిన్ అందించారు. కరోనాను ఎదుర్కొనేప్పుడు ఎలాంటి ధైర్యం ప్రదర్శించారో ఇప్పుడు కూడా అంతే ధైర్యాన్ని చూపాలని మోదీ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు.