Corona Vaccination in India: దేశవ్యాప్తంగా 40కోట్ల మందికి పైగా టీకాలు
*నిన్న ఒక్కరోజే 46.38లక్షల మందికి వ్యాక్సిన్లు * ఇప్పటి వరకు 40,44,67,526 మందికి వ్యాక్సినేషన్
Corona Vaccination in India: భారత్‌లో వ్యాక్సినేషన్ మరో మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా 40కోట్ల మందికిపైగా టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో శనివారం ఒక్కరోజే 46.38 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు వివరించింది. దేశంలో ఇప్పటి వరకూ 40కోట్ల 44లక్షల 67వేల 526 మందికి వ్యాక్సినేషన్ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 135 కోట్ల డోసులు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది.
మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి 70 శాతం మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలంటే రోజూ 85 లక్షల నుంచి 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. జనవరిలో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం టీకా డోసుల సరఫరా తగ్గిపోయి, కొత్త వ్యాక్సీన్లకు అనుమతులు లభించడం ఆలస్యం కావడంతో కొన్ని నెలలపాటు మందకొడిగా సాగింది. ప్రస్తుతం ఒక డోసు వేసుకున్న వారు జనాభాలో 17 శాతం మంది వరకు ఉన్నారు. దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 40 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు.