Corona updates in Tamil nadu: తమిళనాడులో కరోనా ఉధృతి, స్వీయ నిర్భంధంలో గవర్నర్
Corona updates in Tamil nadu: తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజురోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవడమే కాకుండా పదుల సంఖ్యల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
Corona updates in Tamil nadu: తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజురోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవడమే కాకుండా పదుల సంఖ్యల్లో మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని చెన్నైలో వైరస్ విజృంభిస్తూ.. నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,426 మరో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 82 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు కరోనాతో 3,741 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా 2,34,114 కేసులు నమోదు అయ్యాయి. చెన్నైలో గత 24 గంటల్లో 1,117 కేసులు వెలుగుచూడటం గమనార్హం. కరోనా నుంచి కోలుకొని 1,72,883 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తమిళనాడులో 57,490 యాక్టివ్ కేసులు ఉన్నాయని తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
స్వీయ నిర్బంధంలోకి గవర్నర్
తాజాగా తమిళనాడులో రాజ్ భవన్‌లో ముగ్గురికి ముగ్గురికి కరోనా సోకింది. దీంతో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. వైద్యుల సూచన మేరకు ఆయన ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. గవర్నర్ ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారని చెప్పారు. ఇటీవల రాజ్‌భవన్‌లో పనిచేసే 84 మంది భద్రతా, ఫైర్ సిబ్బంది కొవిడ్ బారినపడ్డారు. అయితే, వారిలో ఏ ఒక్కరూ గవర్నర్‌తో గానీ, సీనియర్ అధికారులతోగానీ కాంటాక్ట్ కాలేదని గురువారం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే తాజాగా మరో 38 మందికి పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.