Corona updates in Tamil nadu: తమిళనాడులో కరోనా ఉధృతి
Corona updates in Tamil nadu: తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో రోజురోజుకీ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారు.
Corona updates in Tamil nadu: తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో రోజురోజుకీ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,20,716 కు చేరింది. సోమవారం నాడు మరో 77 మంది కొవిడ్ బారినపడి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా మరణాల సంఖ్య 3571 కు చేరింది. మరోవైపు కరోను జయించి ఇవాళ 5,723 మంది డిశ్చార్జ్ కాగా, ఇక ఇప్పటివరకు 1,62,249 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 61,342 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో చెన్నైలో అత్యధికంగా 1,138 కేసులు నమోదు కావడం గమనార్హం.
మరోవైపు మహారాష్ట్రలోనూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,924 మంది కరోనా వైరస్ బారిన పడగా.. ఈ రోజు 227 మంది మృతి చెందారు. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 13883కి చేరుకుంది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకూ 3,83,723 మంది కరోనా బారిన పడగా, అందులో 1,47,592 మంది రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఉండగా, ఇప్పటివరకూ 2,21,944 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రానున్న రోజుల్లో.. కరోనా తీవ్రత మరింత ఎక్కువగానే ఉండే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.