Corona Towards Community Spread: సామాజిక వ్యాప్తి దిశగా కరోనా.. ఐఎమ్ఎ అభిప్రాయం
Corona Towards Community Spread: కరోనా... ఆ పేరు వింటేనే నేడు పాలు తాగుతున్న పసి పిల్లలు సైతం ఉలిక్కిపడుతున్నారు.
Corona Towards Community Spread: కరోనా... ఆ పేరు వింటేనే నేడు పాలు తాగుతున్న పసి పిల్లలు సైతం ఉలిక్కిపడుతున్నారు. ప్రారంభంలో ఏక అంకె మీద నమోదయ్యే కేసులు నాలుగు నెలలు దాటేసరికి వేలల్లోకి చేరింది. దశల వారీగా చూస్తే దీనిని సామాజిక వ్యాప్తి లో ఉన్నట్టు ఇండియన్ మడికల్ అసోషియేషన్ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం దాదాపుగా ప్రతి గ్రామంలో కేసులు నమోదువుతున్నట్టు తెలుస్తోంది. ఏపీ విషయానికొస్తే తూర్పు గోదావరి జిల్లాలో సుమారుగా వెయ్యి వరకు కేసులు నమోదయినట్టు తెలిసింది. ఇదే దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే 40వేల వరకు నమోదయినట్టు తెలుస్తోంది. ఇది ప్రజలు అజాగ్రత్తగా ఉండటం వల్లే కొంతమేర వ్యాప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని నిలువరించేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడితే తప్ప ప్రభుత్వాలు సైతం ఏమీ చేయలేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. 'దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అని ఐఎమ్ఎ వ్యాఖ్యానించింది. ముఖ్యంగా ఈ వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతం'అని హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ వీకే మోంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమన్నారు. ఈ వ్యాధి సోకిన 70 శాతం మంది రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, రెండోది, మిగతా 30 శాతం మందికి రోగ నిరోధక శక్తిని కల్పించడం'అని డాక్టర్ మోంగా తెలిపారు. ప్రస్తుతానికి ఢిల్లీలో కట్టడి చేసినా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్తితిని నియంత్రించవలసి ఉందని అన్నారు. అయితే కేంద్రం మాత్రం ఇంకా సామాజిక వ్యాప్తి జరగలేదని అభిప్రాయపడుతోంది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా సామాజిక వ్యాప్తి మొదలైందని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు.