Corona Second Wave: భారత్‌లో కంట్రోల్‌లోకి కరోనా సెకండ్‌వేవ్

Corona Second Wave: సెకండ్ వేవ్ కల్లోలం నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోంది.

Update: 2021-06-07 06:16 GMT

కరోనా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )


Corona Second Wave: సెకండ్ వేవ్ కల్లోలం నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోంది. నాలుగు లక్షల పీక్స్ స్థాయి నుంచి రోజువారీ కేసులు లక్షకు దిగొచ్చాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే దేశంలో సెకండ్ వేవ్‌కు ఎండ్ కార్డ్ పడే అవకాశం కనిపిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నట్లు థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటి..? భారత ప్రభుత్వం థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందా..?

భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కంట్రోల్‌లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా లక్షా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత తొమ్మిది రోజుల్లో కేసులు రెండు లక్షల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివిటీ రేటు 58రోజుల కనిష్టానికి తగ్గింది. దానికితోడు రికవరీ రేటు సైతం భారీగా పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.

మరోవైపు థర్డ్ వేవ్ ఊహాగానాలు భారత్‌ను భయపెడుతున్నాయి. సెకండ్ వేవ్ కల్లోలంతో అతలాకుతలం అయిన ఇలాంటి పరిస్థితుల్లో థర్డ్ వేవ్ వస్తే ఏంటి అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు నెలల్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపధ్యంలో వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే కరోనా కట్టడిలో మహారాష్ట్ర ముందు వరసలో నిలుస్తుంది. ఆ రాష్ట్రంలోని నాందెడ్ జిల్లాలో 11 వందల 79 గ్రామాలను కరోనా రహితంగా మార్చినట్లు మహా సర్కార్ చెబుతుంది. ఈ జిల్లాలో 16 వందల 4 గ్రామాలు ఉండగా 11 వందల 79 గ్రామాలు కరోనా రహితంగా ఉన్నాయని, మరో 271 గ్రామాల్లో ఒక్క పాజిటివ్ కేసూ నమోదవ్వలేదని అధికారులు చెబుతున్నారు.

ఇక.. దేశంలో వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రాలకి ఇప్పటికే 24 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా భారత్‌లో మరో టీకా విడుదలకు సిద్ధమైంది. బయోలాజికల్‌-ఇ రూపొందిస్తున్న కార్బి వ్యాక్సిన్ 30కోట్ల టీకాలను సరఫరా చేసేందుకు ఒప్పందం కూడా కుదిరింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర 250 రూపాయలు ఉండొచ్చని సంస్థ చెబుతోంది. మొత్తానిక పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం వ్యాక్సినేషన్‌లో వేగం పెంచడం లాంటి అంశాలు ఊరటకలిగించేవే.! అయితే, మూడోదశ ప్రారంభం కాకుండానే వీలైనంత మందికి వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News