Coronavirus: దేశంలో కరోన రెండో దశ డేంజరస్ బేల్స్

Coronavirus: గతంలో ఎన్నడూ లేనంతగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు * అమెరికా తర్వాత లక్ష దాటింది భారత్‌లోనే

Update: 2021-04-06 02:37 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేర్ సుడిగాలిగా దేశాన్ని చుట్టేస్తోంది. దేశంలోనే సింగిల్ డే కేసుల్లో ఆల్‌టైమ్ హైగా నమోదయ్యింది. నిన్న ఒక్క రోజే లక్షా మూడు వేల 5వందల 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో సింగిల్ డే కేసుల్లో ఇప్పటిదాకా ఇదే ఆల్‌టైమ్ రికార్డు. ఒక్కరోజులోనే లక్ష కేసులు దాటడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో వరుసగా మూడోరోజు అమెరికా, బ్రెజిల్‌లను దేశం అధిగమించింది.

మొదటి దశతో పోలిస్తే రెండో దశతో పోలిస్తే రెండో దశలో కేసుల వేగం విపరీతంగా పెరిగిపోయింది. భారత్‌లో కరోనా ఆనవాళ్లు బయటపడిన తర్వాత 2020 సెప్టెంబర్‌ 17న అత్యధికంగా 97వేల 894 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ రికార్డును మించి ఏకంగా లక్ష మూడు వేలకు చేరాయి. మరోవైపు భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7లక్షల 41వేలకు పైగా ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 5.89 శాతం. ఇక రికవరీ రేటు 92.80 శాతానికి పడిపోయింది.

గత 24గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్‌లతో గతంలో ఎన్నడూ లేనన్ని కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 17 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించిన గరిష్ఠ సంఖ్యలో నమోదయ్యాయి. కొత్త కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ల నుంచే 81.90 శాతం ఉన్నట్టు అధికారులు ప్రకటించారు.

కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నెల 8న రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు. వీడియో సమావేశం విధానంలో నిర్వహించనున్న ఈ భేటీలో ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితుల గురించి, కరోనా టీకాల కార్యక్రమం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News