India's Corona Recovery Rate Rises: దేశంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు
India's Corona Recovery Rate Rises: దేశంలో కరోనా విజృంభిస్తుంది. కేసులు ఓ వైపు భారీగా పెరిగిపోతుంటే..మరోవైపు అదే స్థాయిలో వైరస్ తగ్గుముఖం పట్టి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఉండడం కొంత ఊరట కలిగిస్తుంది.
India's Corona Recovery Rate Rises: దేశంలో కరోనా విజృంభిస్తుంది. కేసులు ఓ వైపు భారీగా పెరిగిపోతుంటే..మరోవైపు అదే స్థాయిలో వైరస్ తగ్గుముఖం పట్టి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఉండడం కొంత ఊరట కలిగిస్తుంది. దేశంలో రికవరీ రేటు ఇప్పుడు భారీగా పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఒకేరోజు రికార్డు స్థాయిలో 51 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్ లో కరోనా వైరస్ బాధితుల రికవరీ రేటు 67.19 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 2.09 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకూ 19,08,255 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 5,86,244మంది మాత్రమే చికిత్స పొందుతుండగా.. 12,82,216 పూర్తిగా డిశ్చార్జి అయ్యారు. అటు, మృతుల సంఖ్య 39,795కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
గత 40 రోజుల క్రితం దేశంలో రికవరీ రేటు 53 శాతంగా ఉండగా .. ప్రస్తుతం ఆ శాతం 67.19 శాతానికి పెరగడం చాలా ఊరట కలిగించే విషయం. అటు మరణాల రేటు కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. జూన్ 18 న మరణాల రేటు 3.33 శాతముంటే..ఇప్పుడది 2.25 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో దేశం మూడోస్థానంలో ఉన్నప్పటికీ...మిగిలిన దేశాలతో పోలిస్తే రికవరీ, మరణాల రేటులో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది.