Corona in Kerala: కేరళలో కరోనా కల్లోలం.. 24 గంటల్లో 20 వేల 624 కేసులు

* కేరళను అతలాకుతలం చేస్తున్న కరోనా * రోజూకు 20వేలకు పాజిటివ్ కేసులు నమోదు

Update: 2021-08-01 05:02 GMT

కేరళలో కరోనా పరీక్షలు (ఫైల్ ఫోటో)

Corona in Kerala: దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి నియంత్రణలోనే ఉన్నప్పటికీ కేరళ రాష్ట్రాన్ని మాత్రం ఈ మహమ్మారి వణికిస్తోంది. నిత్యం 2వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. రోజు వారి కేసులు 20 వేలు దాటడం వరుసగా ఇది ఐదో రోజు దీంతో కేరళలో కొవిడ్ పాజిటివిటీ రేటు 12.31 శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 64 వేల యాక్టివ్ కేసులున్నాట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

కరోనా కేసులు పెరుగుతుండడంతో వీకెండ్ లాక్‌డౌన్ విధించింది కేరళ ప్రభుత్వం. శని, ఆదివారాల్లో కఠినంగా లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వెలుగు చూసినందున వైరస్ కట్టడి చర్యలు చేపట్టడంలో భాగంగా ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ నిర్మూలించడానికి కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Tags:    

Similar News