Corona New Guidelines: ఏప్రిల్ 1నుంచి 30వరకు కొత్త నిబంధనలు అమలు
Corona New Guidelines: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Corona New Guidelines: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అమలులో ఉండనున్నాయి. టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్ పాటించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచిందింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించింది. కంటైన్మెంట్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని మార్గదర్శకాల్లో పెర్కొంది.
జన సామర్థ్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో, కార్యాలయాల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించింది. మాస్కులు లేని వారికి జరిమానా విధించాలని స్పష్టం చేసింది. ఆర్‌టీ.పీసీ.ఆర్ టెస్టులు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వాటిని 70 శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచిందింది. ఇక అంతరాష్ట్ర రవాణా, ప్రయాణాలపై ఎలాంటి పరిమితి విధించారాదు కేంద్రం స్పష్టం చేసింది.