దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా
* రెండు వేలకు చేరువవుతున్న రోజువారీ కేసులు
Covid Virus: మహమ్మారి కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈనెల 25న పాజిటివ్ కేసుల్లో మరింత పెరుగుదల నమోదు కాగా.. దాదాపు రెండు వేల కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్ 2 వేల 2 వందల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి దాదాపు రెండు వేల కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే అధిక కేసులు నమోదవుతున్న పలు రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది కేంద్రం. గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర,తెలంగాణ రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అయితే కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో ఇవాళ అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.