యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం

Update: 2020-03-21 09:50 GMT

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రోజు కూలీలకు ఉపాధి లేకుండా పోతోంది. అనేక చోట్ల థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, సహా జనసమర్థం ఉన్న ప్రాంతాలను మూసివేస్తుండటంతో వాటిపై ఆధారపడి పనిచేసే రోజు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో యోగీ ఆదిత్యానాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి కోల్పోయే రోజువారీ శ్రామికులకు రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. యూపీలోని డెయిలీ లేబర్ మరియు భవన నిర్మాణ కార్మికులకు రోజుకు రూ. 1000 ఆర్థిక సాయం చేయనున్నట్లు సీఎం ఆదిత్యానాథ్ తెలిపారు. ఈ సాయం వల్ల దాదాపు 15 లక్షల మంది రోజువారి కార్మికులు మరియు 20.37 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు.

ఈ మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా అందచేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. అంతేకాకుండా.1.65 లక్షల కుటుంబాలకు ఒక నెల ధాన్యం ఉచితంగా ఇస్తామని ఆయన తెలిపారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు వెంటనే వేతనాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. పెన్షనర్లకు ఏప్రిల్ నెలలో ఒకేసారి రెండు నెలల పెన్షన్ ఇస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని బిపిఎల్ కుటుంబాలకు ప్రభుత్వం తరపున 20 కిలోల గోధుమలు, 15 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 



Tags:    

Similar News