Corona Effect On Employment: క‌రోనా దెబ్బ‌కు ఆ నెల‌లో 50 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఫ‌ట్‌

Corona Effect On Employment: ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మహమ్మారి అత‌లాకుతం చేస్తుంది. ఉద్యోగులపై కరోనా చాలా దారుణంగా ప్రభావాన్ని చూపింది. ఈ వైర‌స్ కార‌ణంగా మ‌న దేశంలో లక్ష‌లాది మంది త‌మ ఉపాధిని కోల్పోయారు.

Update: 2020-08-19 07:02 GMT
Corona Effect On Employment

Corona Effect On Employment: ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మహమ్మారి అత‌లాకుతం చేస్తుంది. ఉద్యోగులపై కరోనా చాలా దారుణంగా ప్రభావాన్ని చూపింది. ఈ వైర‌స్ కార‌ణంగా మ‌న దేశంలో లక్ష‌లాది మంది త‌మ ఉపాధిని కోల్పోయారు. ప‌రోక్షంగా కోట్లాదిమందిపై ప్రభావం పడింది. జూలై నెలలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని భారతీయ ఆర్థికవ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచి జూలై వరకు 1.89 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని వెల్ల‌డించింది. ఉద్యోగాలు కోల్పోవడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోందని హెచ్చరించింది.

సీఎంఐఈ డేటా ప్రకారం ఏప్రిల్‌లో 1.77 మిలియ‌న్ల మంది, మేలో లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాల కోత రోజురోజుకు పెరగడం పట్ల ఆందోళనక‌ర‌మ‌ని, లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని సీఎంఐఈ పేర్కొంది. దేశంలో మొత్తం ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 21 శాతం మంది జీతాలు పొందే రంగంలో ఉన్నారని, అటువంటి వారు ఉద్యోగాలు కోల్పోతే మళ్లీ ఉద్యోగం పొందడం చాలా కష్టమని సీఎంఐఈ వెల్లడించింది.

యువ కార్మికుల పై తీవ్ర ప్ర‌భావం:

లాక్ డౌన్ కారణంగా దేశంలో 41 లక్షల యువ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరిలో అత్యధిక‌ నిర్మాణ, వ్యవసాయ రంగాల్లోని కార్మికులే కావ‌డం మ‌రింత‌ ఆందోళ‌న‌క‌రం. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), ఏషియన్‌ డెవలె్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఏడీపీ) ల ఉమ్మడి నివేదిక తెలిపింది. ఈ నివేదికను ఐఎల్‌వో-ఏడీబీ మంగళవారం విడుదల చేశాయు. కరోనా మహమ్మారి కారణంగా ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో యువత ఉపాధి అవకాశాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నాయి.

ముఖ్యంగా వయోజనుల (25, ఆపై వయసువారు) కన్నా యువత (15-24 ఏళ్ల వయసువారు) ఎక్కువగా ప్రభావితం అవుతారని హెచ్చరించాయి. 'యువత, కొవిడ్‌-19పై ప్రపంచవ్యాప్త సర్వే' అంచనాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు భారీఎత్తున చర్యలు తీసుకోవాలని సూచించాయి.

సాధారణంగా నెలసరి జీతాలు తీసుకునే వారు ఉద్యోగం కోల్పోవడం...కొత్త ఉద్యోగాన్ని పొందడం తక్కువగా జరుగుతూ ఉంటుంది. నెలసరి జీతాలు తీసుకునే వారు భారీ సంఖ్యలో ఉద్యోగులు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందని సీఎంఐఈ తన నివేదికలో అభిప్రాయపడింది. 

Tags:    

Similar News