Corona effect: పలు రాష్ట్రాల్లో 'కరోనా కర్ఫ్యూ'

Corona effect: పండుగల తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి.

Update: 2020-11-22 05:06 GMT

Corona virus second wave

పండుగల తర్వాత కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదర నగరాల్లో శనివారం రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాజధాని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచే కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ సహా ఇండోర్‌, గ్వాలియర్‌, విదిశ, రత్లాం జిల్లాల్లోనూ శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.

కరోనా కేసులు పెరుగుతుండడంతో ముంబైలో స్కూళ్లను డిసెంబరు 31 వరకు తెరవొద్దని నిర్ణయించారు. ముంబైకి ఢిల్లీ నుంచి విమానాలు, రైళ్ల సర్వీసులు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. పరిస్థితిని బట్టి బడులు తెరవాలా? వద్దా? అని నిర్ణయించుకోమని గుజరాత్‌, హరియాణ, మణిపూర్‌ ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలిచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లో సెకండ్‌వేవ్‌ మొదలైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

ఉత్త ర భారతంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌లు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 13 కోట్లు దాటింది. దేశంలో కొత్తగా 46,232 మందికి పాజిటివ్‌ రాగా, 564 మంది మృతి చెందారు. 4.39 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 49,715 మంది కోలుకున్నారని కేంద్రం ప్రకటించింది.

ప్రయాణికుల్లో కొందరికి పాజిటివ్‌ రావడంతో ఎయిరిండియా విమానాల రాకను హాంకాంగ్‌ ప్రభుత్వం డిసెంబరు 3వ తేదీ వరకు రద్దు చేసింది.


Tags:    

Similar News