India: ఈ నెల 25 నుంచి దేశంలో తార స్థాయికి కరోనా కేసులు
India: భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 25 నుంచి దేశంలో కరోనా తారస్థాయికి చేరే అవకాశం ఉంది.
India: భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 25 నుంచి దేశంలో కరోనా తారస్థాయికి చేరే అవకాశం ఉంది. మే 11-15 మధ్య కాలంలో దేశంలో 33 నుంచి 35 లక్షల వరకు యాక్టివ్ కేసులు ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తే...ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణాల్లో ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ మధ్య పాజిటివ్ కేసుల సంఖ్య తారస్థాయికి చేరవచ్చు. మే 1 నుంచి 5 మధ్య కాలంలో ఒడిశా, కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరతాయి. ఇక తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మే 6 నుంచి 10 మధ్యలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్-19 పాజిటివ్ కేసులు తారస్థాయికి చేరినట్లు భావిస్తున్నారు.