Covid-19: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో పెరిగిన కరోనా కేసులు
* అక్టోబర్ 20-26 తేదీల మధ్య 41శాతం కేసుల పెరుగుదల * 4 వారాలుగా రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటవిటీ రేటు
Covid-19: పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ 20-26 తేదీల మధ్య 41 శాతం కోవిడ్ కేసులు పెరిగినట్లు ఆ రాష్ట్రాల ఆరోగ్య శాఖ వెల్లడించింది. నాలుగు వారాలుగా పాజిటీవిటీ రేటు కూడా 1.89శాతం నుంచి 2.22శాతం పెరిగినట్లు వెల్లడించారు.
బెంగాల్‌లోనూ వారం రోజుల్లో 41శాతం కేసులు పెరిగాయి. నాలుగు వారాల్లో పాజిటివిటీ రేటు 1.93శాతం నుంచి 2.39శాతానికి పెరిగింది. దీంతో కంటైన్‌మెంట్ జోన్లను నిర్వహించాలని వాటి పరిధిలోకి వెళ్లి కేసులను గుర్తించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.