Corona: మూడు లక్షలకు చేరువలో రోజువారీ కేసులు
Corona: మూడు లక్షలకు చేరువలో రోజువారీ కేసులు * రోజుకు రెండువేలకుపైగా మరణాలు నమోదు
Corona: భారత్‌లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. అవును.. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదతున్నాయి.
భారత్‌లో బుధవారం కేసుల సంఖ్య మూడు లక్షల మార్కుకు చేరవ కాగా రెండువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో మరణాల సంఖ్య రెండువేలు దాటడం ఇదే మొదటిసారి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తర్వాత ఢిల్లీ, తమిళనాడు, కేరళతోపాటు గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి.
మహారాష్ట్రలో కరోనా డేంబర్ బెల్స్ మోగిస్తోంది. కొత్తగా 67వేల 468 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 40లక్షల 27వేల 827కు.. మొత్తం మరణాల సంఖ్య 61వేల 911కు చేరింది.
మహారాష్ట్రలో కరోనా తాండవం చేస్తోంది. దీంతో ఆ రాష్ట్ర సర్కార్ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ ప్రకటించినా వైరస్ బ్రేకులు పడకపోవడంతో.. "బ్రేక్ ద చైన్"పేరిట మరిన్ని కఠిన ఆంక్షలు ప్రకటించింది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాన్నీ 15శాతం మందితో మాత్రమే పనిచేసేందుకు అవకాశం కల్పించింది. విహహాలు వంటి శుభకార్యాలకు 25 మంది మించరాదని పరిమితి విధించింది. ఇక నిబంధనల్ని అతిక్రమిస్తే 50వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఇకపై ప్రైవేటు వాహనాలను అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామని అదీ డ్రైవర్‌తో కలిపి 50శాతం ప్రయాణికుల సామర్థ్యం మించరాదని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో అయితేనే నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపింది. ఎవరైనా నిబంధనల్ని అతిక్రమిస్తే 10వేల జరిమానా విధించడంతోపాటు లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ప్రైవేటు బస్సులు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించింది. నగరాల మధ్య, జిల్లాల మధ్య ప్రయాణాలపైనా నియంత్రణ ఉంటుందని తెలిపింది. సిటీలో రెండు స్టాప్‌ల కన్నా మించి బస్సుల్ని ఆపరాదని సర్వీస్ ఆపరేటర్లను ఆదేశించినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తానికి ఇవాళ్టి రాత్రి 8 గంటల నుంచి మే 1 వరకు కొత్తగా ప్రకటించిన ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.