Vaccine: భారత్‌లో మరో రెండు టీకాలకు ఆమోదం

New Vaccines: కరోనా కట్టడికి భారత్‌ మరో రెండు టీకాలను ఆమోదించింది.

Update: 2021-12-28 16:00 GMT

Vaccine: భారత్‌లో మరో రెండు టీకాలకు ఆమోదం

New Vaccines: కరోనా కట్టడికి భారత్‌ మరో రెండు టీకాలను ఆమోదించింది. కొవొవ్యాక్స్, కార్బెవాక్స్‌ టీకాలను అత్యవసర వినియోగం కింద ఆమోదించింది. అలాగే యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరవిర్‌ను అత్యవసర సందర్భాల్లో మాత్రమే వినియోగించేలా అనుమతులు మంజూరు చేసింది. వీటి వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి టీకా సాంకేతికతను పొందిన SII కొవొవాక్స్‌ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరులోనే డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేసింది. ఈ క్రమంలోనే CDSIO నిపుణుల బృందం దీన్ని పరిశీలించి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయవచ్చని సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బెవాక్స్‌కు అనుమతినిచ్చింది.

Tags:    

Similar News