INDIA Alliance: దూకుడు పెంచిన ఇండియా కూటమి.. 13 మందితో కోఆర్డినేషన్ కమిటీ
INDIA Alliance: కమిటీలో 13 పార్టీలకు చెందిన నేతలు
INDIA Alliance: కూటమి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమి దూకుడు పెంచింది. 13 మందితో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 13 పార్టీలకు చెందిన నేతలతో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేసీ వేణుగోపాల్, శరద్ పవార్, స్టాలిన్, అభిషేక్ బెనర్జీ, సంజయ్ రౌత్, తేజస్వి యాదవ్, రాఘవ చద్దా, హేమంత్ సోరెన్, జాదవ్ అలీఖాన్, డి.రాజా, ఉమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ సయిదా ఉన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఇక.. సీట్ల పంపకాలపై త్వరలో చర్చలు పూర్తి చేసి.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పంపకాలు ఉండేలా ఇండియా కూటమి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కూటమిలోని పార్టీల అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకుంటూ.. వ్యూహాత్మకంగా ప్రచారాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జుడేగా భారత్, జీతేగా ఇండియా నినాదంతో ప్రజా సమస్యలపై ర్యాలీలకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.