అయోధ్య రామమందిర నిర్మాణ 3Dవీడియో విడుదల
Lohri Festival: ఉత్తరాదిలో ఘనంగా లోహ్రి పండగ... శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ భక్తులకు కానుక, రామమందిర నిర్మాణ 3డీ యానిమేషన్ వీడియో విడుదల.
Lohri Festival: ఉత్తరాదిలో లోహ్రి పండగ సందర్భంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ వీడియోని విడుదల చేసింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగే తీరును 3డీ యానిమేషన్ రూపంలో ట్విటర్ వేదికగా పంచుకుంది. 5 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో.. ఆలయం పునాది నుంచి పైకప్పు వరకూ చూపించారు. అదే విధంగా ఆలయానికి చేరుకునే రోడ్డు మార్గం, గతంలో కట్టిన శ్రీరామ మందిరంతో పాటు ప్రస్తుతం నిర్మిస్తోన్న రామ మందిరం.. తదితర దృశ్యాలను ఏరియల్ వ్యూలో చూపించారు.
2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్-1, ఫేజ్-2 పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ 2023 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు చెబుతోంది.