MP Protem Speaker on Ram Mandir: రామమందిర నిర్మాణం చేపట్టగానే.. కరోనా ఖతం: మధ్యప్రదేశ్ ప్రోటెమ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
MP Protem Speaker on Ram Mandir: ఎన్నో ఏండ్లు వివాదంలో ఉన్న అయోధ్య రామ జన్మ భూమి వివాదం ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో సమస్యకు పరిష్కరం లభించింది.
MP Protem Speaker on Ram Mandir: ఎన్నో ఏండ్లు వివాదంలో ఉన్న అయోధ్య రామ జన్మ భూమి వివాదం ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో సమస్యకు పరిష్కరం లభించింది. రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. దీంతో రామ మందిర ట్రస్టు వారు మందిర నిర్మాణానికి వచ్చే నెల 5 న భూమిపూజ నిర్వహించాలని తీర్మానించారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణం, కరోనా వైరస్ పై మధ్యప్రదేశ్ ప్రోటెమ్ స్పీకర్, బీజేపీ లీడర్ రామేశ్వర్ శర్మ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు.
రామాలయ నిర్మాణం ప్రారంభమైతే భారత్‌లో కరోనా విభృంజన ఆగుతుందని అన్నారు. త్రేతాయుగంలో రాక్షసులను అంతమొందించేందుకు శ్రీ రాముడు అవతరించాడని ఆయన అన్నారు. అదేవిధంగా ఆగస్టు 5న అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించగానే.. శ్రీరాముడు పునర్జన్మ ఎత్తి ప్రజల సంక్షేమానికి పాటుపడతాడని, దీంతో కరోనా వైరస్ విధ్వంసం ఆరంభం అవుతుందని రామేశ్వర్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. . ప్రస్తుతం అందరం భౌతిక దూరం పాటిస్తూ దైవ నామస్మరణ చేస్తున్నామని తెలిపారు. అయోధ్యలో సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం రామాలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు.
ఆగస్టు 5వతేదీన సామాజిక దూరం పాటిస్తూ 200 మంది రామాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి ప్రకటించారు. రామాలయానికి పునాదిరాయి వేసే ముందు ప్రధాని మోదీ హనుమాన్ గర్హి, రాంలాలా దేవాలయాన్ని సందర్శిస్తారని, అక్కడ ఓ మొక్క నాటి భూమి పూజ చేస్తారని గోవింద్ చెప్పారు.