కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
Karnataka Elections: నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సర్వ జనాంగద శాంతియ తోట పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కుటుంబ పెద్దలకు నెలకు 2వేల నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 3 వేల డిప్లొమా ఉన్నవారికి నెలకు 15 వందల చొప్పున ఇస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఎస్సీలకు 15% నుంచి 17%, ఎస్టీలకు 3% నుంచి 7%, మైనారిటీ రిజర్వేషన్లు 4% పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు.
లింగాయత్‌లు, వొక కలిగ్గలు, ఇతర వర్గాల రిజర్వేషన్లను పెంచడంతో పాటు 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ప్రయత్నిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. బజరంగ్ దళ్, PFI వంటి సంస్థలను నిషేధం విధించడంతోపాటు చట్ట ప్రకారం నిర్ణయాత్మక చర్యల తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిల్క్ క్రాంతి పథకం కింద రోజుకు 1.5 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా చేస్తాని... రైతులకు పాల సబ్సిడీని 5 నుంచి 7కి పెంచుతామని కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది.