Karti Chidambaram Tests Coronavirus Positive : ఎంపీ కార్తీ చిదంబరంకు కరోనా పాజిటివ్
Karti Chidambaram Tests Coronavirus Positive: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది. తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. అయితే కరోనా లక్షణాలు మాత్రం స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్‌కు సంబంధించిన సాధారణ లక్షణాలు ఉన్నాయి. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా ఉన్నవారంతా వైద్యులు ఇచ్చే కరోనా సూచనలు పాటించాలని కోరుతున్నా అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో మొత్తం 18,03,695 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,79,357 ఉండగా, 11,86,203 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 38,135 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 65.77 శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,02,02,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,81,027 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.