Chidambaram Responds To Kanimozhi's Tweet : కనిమొళి ట్వీట్‌పై స్పందించిన చిదంబరం
Chidambaram Responds To Kanimozhi's Tweet : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమోళికి చెన్నై విమానాశ్రయంలో చేదు
Chidambaram Responds To Kanimozhi's Tweet : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమోళికి చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.. హిందీకి బదులు ఇంగ్లీష్ గానీ, తమిళం గానీ మాట్లాడమని అడిగినందుకు ఓ అధికారిణి.. కనిమొళిని 'మీరు భారతీయులేనా' అని ప్రశ్నించారు. అయితే ఇది తనకి చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే ఈ ఘటన పైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి. చిదంబరం స్పందించారు..
ఎంపీ కనిమొళికి ఎదురైన అనుభవం అసాధారణమైనది కాదని ఆయన చెప్పుకొచ్చారు. తనకూ ఇదే తరహాలో గతంలో ఎదురయ్యాయని అయన వెల్లడించారు.. ఫోన్‌లో మాట్లాడే సందర్భాల్లో, ముఖాముఖిల్లోనూ హిందీలో మాట్లాడాలని పలువురు కోరారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఉద్యోగులు హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడేలా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చిదంబరం సూచించారు.
The unpleasant experience of DMK MP Ms Kanimozhi at Chennai airport is not unusual.
— P. Chidambaram (@PChidambaram_IN) August 10, 2020
ఒకవేళ హిందు, ఇంగ్లీష్‌లను భారతీయ అధికార భాషలుగా గుర్తించడానికి కేంద్రం కట్టుబడి ఉంటే.. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి హిందీ, ఇంగ్లీషును తప్పనిసరి చేయాలి' అని ఈ 74 ఏళ్ల మాజీ మంత్రి సలహా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరిన హిందీయేతరులు త్వరగా హిందీని నేర్చుకుంటున్నారు.. మరి హిందీ మాట్లాడే ఉద్యోగులు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు" అని అయన మరో ట్వీట్ చేశారు.
కనిమోళికి ఎదురైనా ఘటన పట్ల సీఐఎస్‌ఎఫ్ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.