TikTok: టిక్ టాక్ కి మరో షాక్!
TikTok: టిక్ టాక్ సంస్థ తరుపున తాను వాదించనని స్పష్టం చేశారు ప్రముఖ సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వి
TikTok: టిక్ టాక్ సంస్థ తరుపున తాను వాదించనని స్పష్టం చేశారు ప్రముఖ సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్వి .. తాజాగా కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్ తో పాటుగా 59 చైనా యాప్ లను బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తమపై విధించిన నిషేధాన్ని కోర్టులో సవాల్ చేసేందుకు టిక్‌టాక్ ప్రయత్నిస్తున్నది.
అందులో భాగంగానే మాజీ అటర్నీ జనరల్ ముకుల్ రోహత్గిని ఆ సంస్థ ఆశ్రయించింది. తమ తరుఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వాదించాలని కోరింది. అయితే దీనిపైన ఆయన స్పందిస్తూ.. చైనా యాప్ తరుఫున భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను కోర్టులో వాదించబోనని స్పష్టం చేశారు. ఆ సంస్థకు చెందిన ఒక కేసుపై సుప్రీంకోర్టులో వాదించి గెలిచినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు..
గత కొన్ని రోజుల ముందు ఇండియా - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.. అయితే వారికి ప్రతికారంగా భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. చైనా తయారు చేసిన ఉత్పత్తులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టారు. గతంలోనూ పలువురు ఎంపీలు కూడా ఈ యాప్ లను నిషేధించాలని పార్లమెంట్ లో తమ గళం విప్పారు. ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కేంద్రం బ్యాన్ చేసిన యాప్ లలో టిక్ టాక్ యాప్ తో పాటుగా యూసీ బ్రౌజర్ యూసీ న్యూస్, షేరిట్, డ్యూ బ్యాటరీ సేవర్, హలో, లైక్, యూకామ్, మేకప్, వైరస్ క్లీనర్, విగో వీడియో, వీ చాట్, కామ్ స్కానర్, మొబైల్ లెజెండ్స్, న్యూ వీడియో స్టేటస్, ఫోటో వండర్, వీ మీట్ లతో పాటుగా మొదలగు యాప్స్ ఉన్నాయి.