Missing Samosas: హిమాచల్ మాజీ సీఎం సమోసా పార్టీ ప్రస్తుత సీఎంను ఎగతాళి చేసేందుకేనా?
Missing Samosas: హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం సమోసాలపై రాజకీయం జరుగుతోంది.
Missing Samosas: హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం సమోసాలపై రాజకీయం జరుగుతోంది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు పాల్గొన్న సీఐడీ కార్యక్రమంలో ఆయన కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ కావడంతో సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జైరాం ఠాకూర్ బీజేపీ నేతలకు సమోసా పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్స్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖును ఎగతాళి చేసేందుకే ఈ అల్పాహార విందు ఏర్పాటు చేసినట్టు కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు సమోసా వివాదంపై సీబీఐ దర్యాప్తు చేయడం పట్ల బీజేపీ మండిపడింది. సీఎం కోసం ఉంచిన సమోసాలు కాపాడలేని వారు ప్రజలను ఎలా కాపాడతారని విమర్శించింది. కాగా ఈ ఆరోపణలను సీఎం, అధికారులు ఖండించారు. అధికారుల ప్రవర్తనపై విచారణకు ఆదేశిస్తే... దానిని కనిపించకుండాపోయిన సమోసాల గురించి విచారణకు ఆదేశించినట్లుగా చూపిస్తున్నారని అన్నారు. ఇక దీనిని రాజకీయం చేయొద్దని సీఎ సుఖ్విందర్ సింగ్ స్పష్టంచేశారు. కేవలం ఇదంతా మీడియా సృష్టి మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు.