Weekend Curfew in Delhi: దేశ రాజధానిలో వీకెండ్ కర్ఫ్యూ
Weekend Curfew in Delhi: కరోనా కట్టడికి నిర్ణయం తీసుకోవాల్సిందిగా..ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు వదిలిన కేంద్రప్రభుత్వం
Weekend Curfew in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతునే ఉంది. బుధవారం అక్కడ రికార్డు స్థాయిలో 17,282 కేసులు వెలుగుచూశాయి. 100 మంది వైరస్‌కు బలయ్యారు. ప్రస్తుతం అక్కడ 50,736 చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు అవకాశం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం వెల్లడించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా.. మాల్స్, జిమ్‌లు, ఆడిటోరియంలు, స్పా సెంటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక రెస్టారంట్లలో కేవలం హోండెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుందని, సినిమా థియేటర్లను 30శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ముందుగానే నిర్ణయించుకున్న వివాహ వేడుకులను అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆసుపత్రుల్లో ఎలాంటి పడకల కొరత లేదని వెల్లడించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్న సీఎం అన్నారు. మాస్కులు లేకుండా ఎవరు బయటకు రావద్దని హెచ్చరించారు.